Vijay Devarakonda: ఎయిర్ పోర్ట్ లో చిక్కుకున్న విజయ్ దేవరకొండ.. ఏమైందంటే..?

Vijay Devarakonda: ఎయిర్ పోర్ట్ లో చిక్కుకున్న విజయ్ దేవరకొండ.. ఏమైందంటే..?

కుంభమేళా కావడంతో ప్రయాగరాజ్ కి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో రైళ్లు, బస్సులతోపాటూ విమానాలు కూడా రద్దీగా ఉన్నాయి. కానీ ప్రయాణికులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే ఈరోజు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ కుంభమేళా కి విమానంలో వెళ్లేందుకు అలహాబాద్ కి టికెట్లు బుక్ చేసుకున్నాడు. కానీ సాంకేతిక లోపం కారణంగా ఉదయం బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం క్యాన్సిల్ కావడంతో ఎయిర్ పోర్ట్ లోనే చిక్కుకున్నాడు.  విజయ్ దేవరకొండతో పాటూ ప్రయాణికులు 6 గంటలపాటు ఎయిర్ పోర్ట్ లోనే పడిగాపులు గాస్తున్నారు. దీంతో స్పైస్ జెట్ సంస్థపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ | ఫొటోలు : మోదీతో నాగార్జున ఫ్యామిలీ : పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని

ఈ విషయం ఇలా ఉండగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగులో ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న VD12 (వర్కింగ్ టైటిల్) సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తీ కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.