తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో(Leo). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్(Vikram) లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం, విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి ఈ సినిమాపై.
ఇక తాజాగా జూన్ 22 విజయ్ బర్త్ డే సందర్బంగా ఈ మూవీ నుండి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పోస్టర్ లో విజయ్‌తో పాటు పక్కనే ఓ తోడేలు, వెనక మంచు కొండలు, ఊడిన పళ్లు, చేతిలో సుత్తి, గాల్లో రక్తం వంటి చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ విజయ్ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తోంది. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా త్రిష(Trisha) నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.