విడుదల2 మహారాజా తరహాలో మెప్పిస్తుంది : విజయ్ సేతుపతి

విడుదల2 మహారాజా తరహాలో మెప్పిస్తుంది : విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి, వెట్రి మారన్‌‌ కలయికలో రూపొందిన  ‘విడుదల’ సక్సెస్ సాధించడంతో వీరి కాంబోలో ‘విడుదల2’ చిత్రాన్ని రూపొందించారు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. తెలుగులో చింతపల్లి రామారావు రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.  ఈ సందర్భంగా విజయ్‌‌ సేతుపతి మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులు ఇచ్చే సపోర్ట్‌‌ ఎంతో గొప్పగా ఉంటుంది. ఇటీవల ‘మహారాజా’ చిత్రాన్ని సూపర్‌‌హిట్‌‌ చేశారు. ఆ కోవలోనే  ‘విడుదల-2’ కూడా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది.

 ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచే చిత్రమిది. ఇళయరాజా సంగీతం హైలైట్‌‌గా నిలుస్తుంది’ అని చెప్పారు. ఈ సినిమా తన కెరీర్‌‌‌‌లో చాలా స్పెషల్ అని చెప్పింది హీరోయిన్ మంజు వారియర్. నిర్మాత రామారావు మాట్లాడుతూ ‘విజయ్ సేతుపతి, వెట్రిమారన్ లాంటి క్రేజీ కాంబో చిత్రాన్ని రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.