20వేల మందితో విజయ్ పొలిటికల్ పార్టీ భారీ బహిరంగ సభ..

20వేల మందితో విజయ్ పొలిటికల్ పార్టీ భారీ బహిరంగ సభ..

తమిళ ప్రముఖ హీరో విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీకి అంతా సిద్దమైంది. ఇటీవలే హీరో విజయ్ "తమిళగ వెట్రి కజగం" పేరుతో పార్టీ ని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అలాగే ఈ పార్టీ జెండా ని కూడా ఆవిష్కరించాడు. దీంతో ఫ్యాన్స్తోపాటూ ప్రజలు కూడా తమిళగ వెట్రి కజగం పార్టీ తొలి రాష్ట్ర స్థాయి సదస్సు గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ పార్టీ మొదటి సదస్సు అక్టోబర్ 27న తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్కరవండిలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి దాదాపుగా 20వేలమందికి పైగా అభిమానులు, ప్రజలు రానున్నట్లు సమాచారం. 

దీంతో హీరో విజయ్ ఈ విషయంపై ఎక్స్ ద్వారా స్పందిస్తూ తన అభిమనులకి పలు జాగ్రత్తలు సూచించాడు. ఇందులోభాగంగా తమిళగ వెట్రి కజగం పార్టీ తొలి రాష్ట్ర స్థాయి సదస్సుకి వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఎటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా రావాలని కోరాడు. వీలైతే సైక్లింగ్‌కు దూరంగా ఉండటం మంచిదని ఇది మీ భద్రత కోసం చెబుతున్నానని అన్నారు. అలాగే పోలీస్ మరియు ఇతర భద్రతా దళాల ప్రోటోకాల్ ని పాటించాలని, అక్టోబర్ 27న ఆవిర్భావ సమావేశంలో కలుద్దామని పేర్కొన్నాడు.

ALSO READ | జైలు నుంచి ఇంటికెళ్లిన జానీకి ఎదురైన అనుభవం ఇది.. వీడియో..

ఈ విషయం ఇలా ఉండగా తమిళనాడులో ఇప్పటికే ప్రముఖహీరో కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టారు. కమల్ హాసన్ మక్కల్ నీది మైయం అనే పార్టీని స్థాపించారు. ఈ క్రమంలో 2021లో తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా 180 స్థానాల్లో పోటీ కూడా చేశారు. కానీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు. 

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సొంతంగా పార్టీ పెడుతున్నట్లు ఆమధ్య పలు వార్తలు బలంగా వినిపించాయి. కానీ ఏమైందో ఏమోగానీ పార్టీ పెట్టకముందే రాజకీయ ప్రయత్నాలు వదులుకున్నాడు రజినీకాంత్. మరి సిల్వర్ స్క్రీన్ పై హీరోగా మెప్పించిన హీరో విజయ్ రాజకీయాల్లో ఏవిధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.