విక్రాంత్(Vikranth) హీరోగా..మెహరీన్(Mehreen), రుక్సార్ (Rukshar) లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ స్పార్క్ L.I.F.E (Spark). ఈ సినిమాతో హీరో విక్రాంత్ పరిచయం అవుతుండడంతో పాటు..డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఇవాళ (అక్టోబర్ 14న) స్పార్క్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.
స్పార్క్ ట్రైలర్ స్టార్ట్ అవుతూనే..ఫీల్ అండ్ ఫ్రెష్ మ్యూజిక్ మోడ్ లోకి తీసుకెళ్లింది. హీరో విక్రాంత్, మెహరీన్, రుక్సార్ హీరోయిన్స్ తో ఉన్న లవ్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. కంటికి ఎంతో మంది నచ్చుతారు..మనసుకి కొంతమందే నచ్చుతారు అని రుక్సార్ తో చెప్పిన డైలాగ్ పాతదే అయిన..ఫీల్ ఇస్తుంది.
హీరోయిన్స్ ఇద్దరితోనూ హీరో విక్రాంత్ లవ్ చేసే సీన్స్ బాగున్నాయి. లవ్ తో పాటు స్టార్ కమెడియన్లు వెన్నెల కిశోర్, సత్య కామిక్ యాంగిల్ బాగుంది. ట్రైలర్ స్టార్ట్ అయిన కాసేపు లవ్, కామెడీతో ఫర్వాలేదు అనిపించిన..సడెన్ గా స్టోరీ క్రైమ్ యాంగిల్ లోకి మారడం థ్రిల్ ఇస్తుంది. ఒక అమ్మాయి తర్వాత మరొక అమ్మాయి..ఇలా వరుసగా హత్యలకు గురైన అమ్మాయిలను చూపించడంతో స్పార్క్ ట్రైలర్ ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాకుండా ఈ మర్డర్స్ ను చేసింది హీరో అన్నట్లు చూపించారు.
ఖుషి ఫేమ్..హేషామ్ అబ్దుల్ వాహెబ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ఇంతెన్సె ఫీల్ కలిగిస్తోంది.ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ స్పార్క్ మూవీ పై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో సీనియర్ యాక్టర్ నాజర్, సుహాసిని, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే నెల (నవంబర్ 17న) తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.