
తొలి సిక్స్ ప్యాక్ ఎవరిదన్న విషయంపై కోలీవుడ్లో వివాదం నెలకొంది. సూర్య హీరోగా నటించిన 'రెట్రో' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది.
ఈ మూవీ ఈవెంట్లో సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివ కుమార్ మాట్లాడుతూ తన కొడుకు సూర్య కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాలను గురించి చెప్పుకొచ్చారు. గంటలకు గంటలు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ, జిమ్లో వర్కౌట్లు చేసేవాడు. కోలీవుడ్లో మొదటగా సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేసింది తన కొడుకు అని, అతడిలా ఎవరూ కష్టపడలేరని కామెంట్ చేశారు.
అయితే ఇపుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై విశాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. కోలీవుడ్లో అందరికంటే ముందుగా సిక్స్ ప్యాక్ చేసింది ధనుష్. 2007 చిత్రం 'పొల్లాధవన్' క్లైమాక్స్‌లో మొదట సిక్స్ ప్యాక్ అబ్స్‌తో కనిపించినది ధనుష్ అని స్పష్టం చేశాడు.
ఆ తర్వాత 2008లో వచ్చిన 'సత్యం' కోసం నేను చేశాను. 'మదగజరాజ' లోనూ అదే లుక్లో కనిపించాను. ఆ విషయాలను వాళ్లు మర్చిపోయి ఉండొచ్చు' అని విశాల్ సూచించారు.
Dhanush was the first person to get a 6 pack Body in #Pollathavan. And then its me in #Sathyam and #MGR.
— Christopher Kanagaraj (@Chrissuccess) April 24, 2025
- Vishal pic.twitter.com/QixrnjvxtZ
ఈ సిక్స్ ప్యాక్ 1 పంచాది ఇప్పుడు కోలీవుడ్ ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది. ఇకపోతే, 2008లో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన 'వారణం ఆయిరం' చిత్రంలో సూర్య తన లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించగా, 2007లో ధనుష్ చేసిన తొలి మార్పు అప్పట్లో పెద్దగా గుర్తించబడలేదు.