Vishal: ఆ మాట చెప్పడానికి మీరెవరు.. ప్రముఖ నిర్మాణ సంస్థపై విశాల్ ఫైర్

Vishal: ఆ మాట చెప్పడానికి మీరెవరు.. ప్రముఖ నిర్మాణ సంస్థపై విశాల్ ఫైర్

తమిళ స్టార్ విశాల్(Vishal) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam). మాస్ చిత్రాల దర్శకుడు హరి(Hari) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్(PriyaBhavani shankar) హీరోయిన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ట్రయిలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ అంశాలతో వచ్చిన ఈ ట్రైలర్ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే సినిమాపై అంచనాలను పెంచేసింది. 

ఇక రత్నం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరో విశాల్. ఇందులో భాగంగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పిక్చర్స్ పై ఫైర్ అయ్యారు. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? ఏ డేట్ కి రావాలి? ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇవ్వాలి అనేది కూడా రెడ్ జెయింట్ సంస్థ డిసైడ్ చేస్తోంది. మేము డబ్బులు పెట్టి, వాటికి వడ్డీలు కడుతూ, కష్టపడి సినిమాలు తీస్తుంటే.. కొందరు ఏసీ రూంలో కూర్చుని థియేటర్ ఓనర్లకు ఫోన్ చేసి.. ఆ సినిమా వేయండి, ఈ మూవీ తీసేయండని చెబుతున్నారు. అసలు ఆ మాట చెప్పడానికి మీరు ఎవరు? మీకు ఆ హక్కు, అధికారం ఎవరిచ్చారు.. అంటూ ఫైర్ అయ్యారు విశాల్.

ఇక విశాల్ గత చిత్రాల విషయంలో కూడా ఇలాగే జరిగిందట. ఎనిమీ, మార్క్ ఆంటోనీ సినిమాలకు కూడా తగినన్ని థియేటర్స్ ఇవ్వలేదు అని ఆయన అన్నారు. ఇప్పుడు రత్నం సినిమాకు కూడా అదే రిపీట్ అవుతుండటంతో వారిపై మండిపడ్డారు విశాల్. ప్రస్తుతం విశాల్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.