విశ్వక్ సేన్ నుంచి వస్తోన్న సినిమా ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకుడు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను గురించి విశ్వక్ సేన్ ఇలా ముచ్చటించాడు.
వాస్తవిక అంశాల ఆధారంగా తెరకెక్కించిన సినిమా అయినప్పటికీ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌కి సెకండ్ హాఫ్‌కి జానర్ మారుతుంది. సెకండ్ హాప్‌లో అడ్రినలిన్ రష్ ఉంటుంది. అది మొదలైన పది నిమిషాల తర్వాత ఫోన్ వస్తే కట్ చేసి జేబులో పెట్టుకునేంత హై మూమెంట్స్ ఉంటాయి. ట్రైలర్‌లో అంతగా రివీల్ చేయలేదు కానీ కథ చాలానే ఉంది. అందరూ కనెక్ట్ అయ్యేలా అది ఉంటుంది.
నాలుగైదేళ్లుగా జరుగుతున్న ఓ బర్నింగ్ పాయింట్‌ను ఇందులో టచ్ చేశాం. అది తెరపై చూసినప్పుడు ప్రేక్షకులు సర్‌ప్రైజ్ ఫీల్ అవుతారు. ఇంతకాలం ఈ పాయింట్‌ను ఎవరు ఎందుకు టచ్ చేయలేదో అనిపిస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఈ సినిమా ఒకే టైమ్‌లో చేశా. అది ముందుగా రావడంతో ఈలోపు మేము ఇందులో చెబుతున్న పాయింట్ మరేదైనా సినిమాలో వస్తుందేమోననే టెన్షన్ ఉండేది. కానీ ఎవరూ టచ్ చేయలేదు. కచ్చితంగా అది సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.
ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అన్‌ప్రిడిక్టబుల్ మూవీ. ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అలాగే ఇది కేవలం హీరో డ్రివెన్ ఫిలిం కాదు. నా పాత్రతో పాటు మీనాక్షి, శ్రద్ధా, నరేష్ గారు, రఘు, సునీల్ పాత్రలన్నింటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, రైటింగ్‌కి చాలా మంచి పేరు వస్తుంది.
రవితేజ చాలా స్మార్ట్ డైరెక్టర్. చాలా బాగా తీశాడు. సినిమా చూసిన ప్రేక్షకులు మొదట అతని రైటింగ్, డైరెక్షన్‌ని మెచ్చుకుంటారు. అలాగే జేక్స్ బిజోయ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాత రామ్ తాళ్లూరి గారి ఓపిక కారణంగానే ఇంత మంచి సినిమా వచ్చింది. ఇక నా కొత్త చిత్రాల విషయానికొస్తే.. ‘లైలా’ అరవై శాతం పూర్తయింది. సుధాకర్, అనుదీప్ గారి సినిమాలు సమాంతరంగా జరుగుతున్నాయి. ‘కల్ట్’ మార్చ్‌లో స్టార్ట్ చేస్తాం. ‘ఏమయింది నగరానికి 2’ రైటింగ్ జరుగుతోంది.