
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈమధ్య ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోతున్నాడు. ఇటీవలే వచ్చిన లైలా సినిమా ప్లాప్ అయ్యింది. అంతకుముందు వచ్చిన మెకానిక్ రాఖీ ఫర్వాలేదనిపించినప్పటికీ థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో బాగానే వర్కౌట్ అయ్యింది. దీంతో విశ్వక్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే 2019లో వచ్చిన ఫలక్నుమా దాస్ సినిమాని రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని కూల్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో ఫలక్నుమా దాస్ సినిమాని ఏప్రిల్ 10న రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీంతో విశ్వక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ఇపుడున్న సిచ్యుయేషన్ లో ఫలక్నుమా దాస్ పార్ట్ 2 రిలీజ్ అయితే మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉందని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇకనుంచయినా స్క్రిప్ట్ సెలెక్షన్ పై దృష్టి సారిస్తే మంచిదని లేదంటే కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
#FalaknumaDas is re-releasing in theatres on APRIL 10th? pic.twitter.com/jpWwt94M9w
— VishwakSen (@VishwakSenActor) April 4, 2025
ఈ విషయం ఇలా ఉండగా ఫలక్నుమా దాస్ సినిమాలో హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించడంతోపాటూ దర్శకత్వం కూడా వహించాడు. ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఇన్సిడెంట్స్ తో తీసిన ఈ సినిమా హీరో విశ్వక్ సేన్ కేరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నప్పటికీ ఈమధ్య విశ్వక్ నటించిన సినిమాలు ప్లాప్ అవుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
►ALSO READ | దర్శకుడు బుచ్చిబాబుకు రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేక బహుమతి.. ఎంతో ఆధ్యాత్మిక అర్థం!
ప్రస్తుతం విశ్వక్ సేన్ "ఫంకీ" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.