మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) లేటెస్ట్ దేవర ట్రైలర్ ను (DevaraTrailer) విమర్శించిన ఓ ఇద్దరు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ పై ..యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) మండిపడ్డాడు. తన పేరు ఖరాబ్ చేయడానికే వీడు పుట్టాడంటూ అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందో చూడండి.
రీసెంట్గా మేకర్స్ రిలీజ్ చేసిన దేవర ట్రైలర్కు.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. తారక్ నట విశ్వరూపానికి అందరూ ఫిదా అయ్యారు. దాంతో యూట్యూబ్లో అదిరిపోయే వ్యూస్తో ట్రేండింగ్లో ఉంది.
ఇదిలా ఉండగా..దేవర ట్రైలర్ నచ్చలేదంటూ ఓ ఇద్దరు ఇన్ ఫ్లూయెన్సర్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా వారి శైలిలో నెగిటివ్ రివ్యూ కూడా ఇచ్చారు. ట్రైలర్ చూడ బుద్ది కాలేదని ఒక యూట్యూబర్ అనగా.. ట్రైలర్ ఇంపాక్ట్ పెద్దగా క్రియేట్ చేయలేదని మరొకొడు కామెంట్ చేశాడు. ఎన్టీఆర్ లుక్స్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో హీరో విశ్వక్ సేన్.. వారిద్దరి రివ్యూలపై ఫుల్ సీరియస్ అవుతూ ట్వీట్ల వర్షం కురిపించారు.
"నా పేరు ఖరాబ్ చేయడానికే పుట్టాడు వీడు. ఫస్ట్ గోడ సపోర్ట్ లేకుండా రెండు నిమిషాలు కూర్చో నువ్వు. తర్వాత సినిమాని, ఆడియెన్స్ ని ఉద్ధరిద్దువుగానీ. కాల్తుంది నాకు..కానీ, ఆల్రెడీ కాలిపోయిన ఫేస్ నీది. ఏం చేద్దాం. నువ్వే మాట్లాడాలి అందం గురించి" అని విశ్వక్ కామెంట్ చేశాడు.
అదే సమయంలో అవతలి వ్యక్తి పేరు కూడా విశ్వకే అని క్లారిటీ ఇచ్చాడు.ఆ కుడివైపు ఉన్న వ్యక్తి పేరు కూడా విశ్వక్ అని అనుకుంటున్నాను" అని విశ్వక్ సేన్ కామెంట్ చేయడం విశేషం. ఇప్పుడతని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాను జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానిని అని గతంలోనే విశ్వక్ సేన్ చెప్పిన విషయం తెలిసిందే. దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.