Vishwak Sen: తిరుమ‌ల శ్రీవారి సేవలో హీరో విశ్వ‌క్ సేన్.. ఫొటోస్ వైరల్

Vishwak Sen: తిరుమ‌ల శ్రీవారి సేవలో హీరో విశ్వ‌క్ సేన్.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen) తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్నాడు. త్వరలోనే ఆయన హీరోగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari) సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే సోమవారం ఉందయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో విశ్వక్ సేన్ జంటగా నేహా శెట్టి నటిస్తున్నారు. అంజలి కీ రోల్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్నారు. రూరల్ బ్యాక్డ్రాప్ లో పొలిటికల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే చాట్ బస్టర్ గా నిలిచాయి. మరీ ముఖ్యంగా మోత మోగిపోద్ది సాంగ్ మాస్ ని ఊపేస్తోంది. మొత్తంగా ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి విడుదల తరువాత ఆ అంచనాలను అందుకుంటుందా చూడాలి.

Also Read:వార్ 2లో మరో సౌత్ స్టార్.. ఇక ఈ సినిమాను ఆపడం కష్టమే