KPHB ఆంటీలా ఉన్నావంటూ హీరో విశ్వక్ సేన్ పై ట్రోలింగ్..

KPHB ఆంటీలా ఉన్నావంటూ హీరో విశ్వక్ సేన్ పై ట్రోలింగ్..

టాలీవుడ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ హిట్, ఫ్లాపులతో సంబందం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం తెలుగులో లైలా అనే సినిమాలో హీరోగానటిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ కి జంటగా పంజాబీ బ్యూటీ ఆకాంక్ష శర్మ నటిస్తుండగా నూతన దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యునిట్ ప్రమోషన్స్ శురూ చేశారు. ఇందులో భాగంగా ఇటీవలే ఈ సినిమాలోని ఇచ్చుకుందాం బేబీ అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి హీరో విశ్వక్ సేన్ సమాధానాలు ఇచ్చాడు. 

ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ ఏకంగా మిమ్మల్ని లైలా సినిమాలో లేడీ గెటప్ లో చూసిన కొందరు KPHB ఆంటీలా ఉన్నావంటూ కామెంట్లు చెయ్యడమే కాకుండా ట్రోల్ చేస్తున్నారని దీనిపై మీ స్పందన ఏమిటని అడిగాడు. దీంతో విశ్వక్ సేన్ స్పందిస్తూ  ఇంటర్నేషనల్ ఫిగర్ ని ఇలా KPHB ఆంటీలతో పోలుస్తారా అంటూ ఫన్నీగా  రిప్లయ్ ఇస్తూ సరదాగా నవ్వించాడు. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య విశ్వక్ హీరోగా నటించిన మెకానిక్ రాఖీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు ఫర్వాలేదనిపించాయి. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయాయి. దీంతో లైలా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని విశ్వక్ సేన్ బాగానే శ్రమించాడు. అయితే లైలా సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు టీజర్ బాగానే ఆకట్టుకుంటున్నాయి.