
'కేజీఎఫ్' హీరో యష్ సోమవారం (2025 ఏప్రిల్ 21న) ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి, స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి హారతికి ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..'నేను శివునికి పెద్ద భక్తుడిని. అందరూ ఆనందంగా ఉండటం కోసం తాను పూజలు చేశానని' యష్ వెల్లడించారు.
#WATCH | Madhya Pradesh: Actor Yash says "I am very happy. I wanted the blessings of Lord Shiva, as I am a huge devotee of Shiva. I prayed for the happiness and prosperity of everyone." https://t.co/PeD3kaLj0M pic.twitter.com/fZSvZIWwjj
— ANI (@ANI) April 21, 2025
ప్రస్తుతం యష్ టాక్సిక్ మూవీలో నటిస్తున్నాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్, కన్నడతో పాటు పలు ఇండియన్ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ సినిమా తర్వాత హీరో యష్ బాలీవుడ్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ 'రామాయణ' ప్రాజెక్ట్ లో పాల్గొనున్నారు.
►ALSO READ | SekharKammula: ‘పోయిరా మామ’ సాంగ్.. శేఖర్ కమ్ముల మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్
ఈ క్రమంలోనే యష్ ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నట్లు సమాచారం. నితేష్ తివారీ తెరకెక్కించనున్న 'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్,రావణుడిగా యష్ నటించనున్నాడు. సాయి పల్లవి సీత పాత్రలో నటించనుంది. రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు ఇటీవల టాక్ వినిపించింది.