అప్పుడే పుట్టిన శిశువుకు సీపీఆర్

అప్పుడే పుట్టిన శిశువుకు సీపీఆర్
  • ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

నర్వ, వెలుగు: కదలిక లేని ఓ శిశువును జిల్లా ఆసుపత్రికి తరలిస్తూ డాక్టర్ల సూచన మేరకు ఈఎన్టీ రాజ్​కుమార్​ సీపీఆర్​ చేసి ప్రాణం పోశాడు. వివరాలిలా ఉన్నాయి.. నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామానికి చెందిన పెద్దమాలే చిట్టెమ్మ, రాజు దంపతుల కూతురు అఖిల మొదటి డెలివరీ కోసం సోమవారం ఉదయం నర్వ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆమె మగ శిశువుకు జన్మనివ్వగా.. శ్వాస, కదలిక లేకపోవడంతో 108లో మహబూబ్​నగర్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

మార్గమధ్యలో శిశువు పరిస్థితి విషమంగా మారడంతో ఈ విషయాన్ని 108 సిబ్బంది నర్వ ఆసుపత్రి డాక్టర్లు​శివ, మౌనిక దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనలతో ఈఎన్టీ రాజ్​కుమార్​ సీపీఆర్​ చేయడంతో శిశువులో కదలిక వచ్చింది. మహబూబ్​నగర్​ ఆసుపత్రికి చేరుకోగా, మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈఎన్టీ రాజుకుమార్ ను పాలమూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్​కుమార్, కుటుంబ సభ్యులు అభినందించారు.