
టాలీవుడ్ స్టార్ హీరోలైన వెంకటేష్, మహేష్ బాబు కలసి నటించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోల చెల్లెలి పాత్రలో నటించిన ప్రముఖ నటి అభినయ తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమే. అయితే నటి అభినయ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది...
ఇందులో భాగంగా ఆదివారం తనకి కాబోయే భర్తతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలిపింది. ఈక్రమంలో తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో ఈ విషయానికి సంబందించిన ఫోటోని కూడా షేర్ చేసింది. ఈ ఫొటోలో అభినయ తన భర్తతో కలసి గుడిలో గంట మ్రోగిస్తూ కనిపించింది. అయితే తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. దీంతో నెటిజన్లు నటి అభినయ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవారా..? అంటూ ఇంటర్ నెట్లో ఆసక్తిగా వెతుకుతున్నారు.
గతంలో నటి అభినయ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తో ప్రేమలో పడిందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పలు వార్తలు బలంగా వినిపించాయి. కానీ అభినయ మాత్రం విశాల్ తనకి మంచి స్నేహితుడని, తమ ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉందని అంతేతప్ప ప్రేమా, గీమా వంటివి లేవని క్లారిటీ ఇచ్చింది. హీరో విశాల్ కూడా పలు ఇంటర్వూలలో ఇదే చెప్పాడు.
ALSO READ | SSMB29: మహేష్ బాబు వీడియోలు లీక్.. అడవుల్లో అలాంటి సీన్లు..
నటి అభినయ మూగ, చెవుడు అయినప్పటికీ సన్నివేశానికి తగ్గట్టుగా హావభావాలు పలికిస్తూ అద్భుతంగా రాణిస్తోంది. అంతేకాదు ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన అభినయ ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిభకి వైకల్యం అడ్డు కాదని నటి అభినయ నిరూపించింది.