Amala Paul Son: హీరోయిన్ అమలాపాల్ కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. చూడండి

Amala Paul Son: హీరోయిన్ అమలాపాల్ కొడుకు ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. చూడండి

ప్రముఖ టాలీవుడ్‌ హీరోయిన్‌ అమలా పాల్‌ (Amala Paul) 2024 జూన్‌11న పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓనం పండగ సందర్భంగా కొడుకు ఇళయ్ ముఖాన్ని రివీల్ చేసింది అమలా పాల్‌.

ఆదివారం సెప్టెంబరు 15 ఓనం పండుగ సందర్భంగా తమ ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ..కొడుకు ఇళయ్, భర్త జగత్ దేశాయ్‌లతో దిగిన క్యూట్ ఫోటోలను ఇన్ స్టాలోషేర్ చేసింది.

నదిలో పడవలో కొడుకు, భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవగా.. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమలాపాల్ కొడుకు క్యూట్ గా చూడముచ్చటగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక అమలా పాల్ 2014లో దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ను పెళ్లి చేసుకొని.. 2017లో వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుంది. అలా దాదాపు ఆరేళ్ళు ఒంటరిగానే ఉన్న అమలా పాల్ తన లేటెస్ట్ బాయ్‌ఫ్రెండ్‌, టూరిజం, హాస్పిటాలిటీ ప్రొఫెషనల్‌ జగత్‌ దేశాయ్ (Jagat Desai)‌‌ను పెళ్లి చేసుకుంది. 2023 నవంబర్‌ మొదటివారం కోచిలో ఈ జంట వివాహంచేసుకున్నారు.

Also Read :- పీరియాడిక్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో కార్తి కొత్త చిత్రం షురూ

అమలా పాల్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఆమె మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్ తో ఆడు జీవితం(ది గోట్ లైఫ్‌) అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్ భార్యగా కనిపించిన ఆమె తన నటనతో ఆడియన్స్ ను అలరించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత మరో సినిమాను ప్రకటించలేదు అమలా పాల్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amala Paul (@amalapaul)