Amala Paul: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలా పాల్

Amala Paul: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలా పాల్

టాలీవుడ్‌ హీరోయిన్‌ అమలా పాల్ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. ఇటీవలే ఆమె తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్ళైన కొద్దిరోజులకే ప్రెగ్నెన్సీని కూడా ప్రకటించారు ఈ జంట. ఇక తాజాగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. జూన్ 11న జన్మించిన ఆ బిడ్డను ఇంటికి తీసుకెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు అమలా పాల్. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవగా.. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jagat Desai (@j_desaii)

ఇక అమలా పాల్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఆమె మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్ తో ఆడు జీవితం(ది గోట్ లైఫ్‌) అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్ భార్యగా కనిపించిన ఆమె తన నటనతో ఆడియన్స్ ను అలరించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత మరో సినిమాను ప్రకటించలేదు అమలా పాల్.