Ananya Nagalla : బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ అనన్య నాగళ్ల

Ananya Nagalla : బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ అనన్య నాగళ్ల

ఆరేళ్ల క్రితం ‘మల్లేశం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. డిఫరెంట్ స్ర్కిప్ట్‌‌లను సెలెక్ట్ చేసుకుంటూ నటిగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది అనన్య నాగళ్ల. ‘వకీల్ సాబ్‌‌’ సినిమాలో  తనదైన నటనతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. తర్వాత తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి వినూత్నమైన సినిమాల్లో విభిన్న పాత్రలతో మెప్పించింది. ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్‌‌తోనూ అందర్నీ  అలరించింది.  

ఇదిలా ఉంటే.. అనన్య నాగళ్ల ఇప్పుడు  స్మాల్ స్కేల్ విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌‌గా మారిపోయింది. రూ.5 కోట్ల బడ్జెట్‌‌తో తనతో లేడీ ఓరియెండెట్ మూవీస్‌‌కు ప్లాన్ చేస్తున్నారట పలువురు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె.. మరికొన్ని క్రేజీ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలాగే  బాలీవుడ్ డెబ్యూకి కూడా రెడీ అవుతోందని తెలుస్తోంది.  తను  మెయిన్ లీడ్‌‌గా ఒక హిందీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని, వాటి వివరాలు త్వరలోనే అనౌన్స్‌‌చేయనున్నారు.