అడ్డాల ఐశ్వర్య.. ప్రముఖ సీరియల్ నటినే కాదు.. హీరోయిన్ కూడానూ.. 3 ముఖి, నీ రూటే సెపరేట్, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అనే సినిమాల్లో నటించింది. అంతే కాదు.. అమ్మాయిగారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం వంటి ప్రముఖ సీరియల్స్ లో నటిస్తుంది. ఇవన్నీ చెప్పుకోదగిని సీరియల్సే.. ఇప్పుడు ఈ ఐశ్వర్య కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. 2023, అక్టోబర్ లో.. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా శ్యాంకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. ఇంట్లో కుదిర్చిన వివాహమే..
2023, అక్టోబర్ లో శ్యాంకుమార్ ను పెళ్లి చేసుకున్న అడ్డాల ఐశ్వర్య.. నెల రోజులు తిరక్కుండానే భర్త శ్యాంకుమార్ కు టార్చర్ చూపించటం మొదలుపెట్టిందంట.. ఈ విషయాన్ని ఐశ్వర్య భర్త స్వయంగా పోలీస్ కంప్లయింట్ ఇవ్వటంతో ఇప్పుడు బయట ప్రపంచానికి తెలిసింది. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పెళ్లి చేసుకున్న తర్వాత.. నెల రోజుల్లో ఇంట్లో గొడవలు మొదలయ్యాయని చెబుతున్నాడు భర్త. అంతే కాదు.. ఆ ఆరు నెలల్లో.. భర్త శ్యాంకుమార్ ను బెదిరించి.. 25 లక్షల రూపాయలు తీసుకున్నదంట.. అంతే కాకుండా విడాకులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతుందంట. దీనికితోడు ఇంట్లో భర్త వేధిస్తున్నాడంటూ ఏకంగా కంప్లయింట్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నాడు భర్త శ్యాంకుమార్.
ALSO READ :- సీరియల్ నటి ఐశ్వర్య ఇంట్లో గొడవలు.. వేధిస్తుందంటూ భర్త కంప్లయింట్
మ్యాట్రిమోనీ సైట్ చూసి పెళ్లి చేసుకున్నామని.. సీరియల్ నటి అని.. ఉన్నత కుటుంబం అని భావించామని.. తీరా పెళ్లి తర్వాత అడ్డాల ఐశ్వర్య నిజ స్వరూపం తెలిసింది అంటున్నాడు భర్త శ్యాంకుమార్. హీరోయిన్, సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్యకు.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అతను చెప్పినట్లు చేస్తుందని.. తన దగ్గర 25 లక్షల రూపాయలు తీసుకుని ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు భర్త. తనపైనే రివర్స్ కేసులు పెడుతుందని.. ఇంట్లో టార్చర్ భరించలేక.. పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్లు చెబుుతున్నాడు భర్త శ్యాంకుమార్.