
కేథరిన్ థ్రెసా ఫిమేల్ లీడ్‌గా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందించిన చిత్రం ‘ఫణి’. మహేశ్ శ్రీరామ్ కీలక పాత్ర పోషించాడు. డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘వీఎన్ ఆదిత్య కొత్త వాళ్లతో సినిమా చేయగలడు, స్టార్స్‌తోనూ తీయగలడు. వారి సోదరి మీనాక్షి నిర్మిస్తున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
హీరోయిన్ కేథరిన్ థ్రెసా మాట్లాడుతూ ‘ఈ తరహా సినిమా నేను ఇప్పటిదాకా చేయలేదు. ఇందులో వివిధ దేశాల ఆర్టిస్టులు నటించారు. వీఎన్ ఆదిత్య గారు ప్రతిసారీ జానర్ మార్చి కొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ‘చిన్నగా మొదలుపెట్టిన ఈ చిత్రం కేథరిన్ ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది.
మే నెలలో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పాడు. ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ డా.మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కేథరిన్ నటనకు నేషనల్ అవార్డ్ వస్తుంది. కేథరిన్‌తో పాటు పాము క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. అందరి సపోర్ట్ ఈ సినిమాకు దక్కుతుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. నటుడు కాశీ విశ్వనాథ్, మూవీ ప్రెజెంటర్ పద్మనాభరెడ్డి, కో ప్రొడ్యూసర్ శాస్త్రి అనిపిండి తదితరులు పాల్గొన్నారు.