Celebrity Divorce: టాలీవుడ్ హీరోయిన్ విడాకులు నిజమేనా? ..పెళ్లి ఫొటోలన్నీ డిలీట్, అన్‌ఫాలో

Celebrity Divorce: టాలీవుడ్ హీరోయిన్ విడాకులు నిజమేనా? ..పెళ్లి ఫొటోలన్నీ డిలీట్, అన్‌ఫాలో

సెలబ్రెటీల విడాకుల పర్వం సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ గానే ఉంటుంది. అందులో కొంతమంది నటి నటుల అధికారికంగా ప్రకటిస్తున్నారు. మరికొందరు ఫోటోలు డిలీట్ చేస్తూ సైలెంట్గా ఉంటున్నారు. దాంతో, చిన్న ఛాన్స్ దొరికిన అది నెట్టింట్లో డివోర్స్ రూమర్గా వైరల్ అవుతుంది. 

లేటెస్ట్గా టాలీవుడ్ హీరోయిన్ కలర్స్ స్వాతి (Colours Swathi) విడాకుల ఇస్యూ మరోసారి తెరపైకి వచ్చింది. 2018లో తన బాయ్‌ఫ్రెండ్ వికాస్ వాసుని పెళ్లి చేసుకుంది స్వాతి. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో భర్తకు సంబంధించిన ఫోటోలన్నింటినీ స్వాతి డిలీట్ చేసేసింది. దీంతో స్వాతి ఇన్‌డైరెక్టుగా విడాకులను కన్ఫార్మ్ చేసినట్టేనని అనుకుంటున్నారు నెటిజన్లు.

Also Read :- ఆస్కార్ 2025 నామినేషన్స్ చిత్రాలివే

కేరళకు చెందిన వికాస్ వాసు, పైలైట్‌గా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లైన మూడేళ్లకే ఈ ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. స్వాతి ఏ సినిమా ఫంక్షన్కి వెళ్లిన మీడియా నుంచి ప్రశ్నలు కూడా ఎదురువుతూ వస్తున్నాయి. కానీ, ఇప్పటికీ ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు. ఫోటోలు డిలేట్ చేసినంత మాత్రాన విడిపోతున్నట్లు ఎలా అనుకుంటారు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. మరి ఇప్పుడు తాజాగా వస్తున్న రూమర్స్పై స్వాతి ఎలా స్పందిస్తుందో చూడాలి.
 
నటి స్వాతి కెరీర్ విషయానికి వస్తే

కలర్స్ అనే షో ద్వారా యాంకర్గా పరిచయమయ్యారు స్వాతి. తన క్యూట్ క్యూట్ మాటలతో చిలిపి చేష్టలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న ఆమె.. ఆ తరువాత నటిగా మారారు. అలా.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మిరపకాయ్, కందిరీగ వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ కనిపంచిన ఆమె.. అష్టా చెమ్మ సినిమాతో హీరోయిన్గా మారారు. ఆతరువాత నిఖిల్ హీరోగా వచ్చిన స్వామిరారా, కార్తికేయ సినిమా విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు స్వాతి. చాలాగ్యాప్ తరువాత ఇటీవలే  ఆమె నటించిన లేటెస్ట్ మూవీ మంత్ ఆఫ్ మధు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sai DURGHA Tej (@jetpanja)