Trisha Krishnan: సీఎం కావాలని ఉందంటున్న హీరోయిన్ త్రిష.. ఆ పార్టీలో చేరబోతోందా.?

Trisha Krishnan: సీఎం కావాలని ఉందంటున్న హీరోయిన్ త్రిష.. ఆ పార్టీలో చేరబోతోందా.?

టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది తమిళ్ నటి త్రిష కృష్ణన్. అంతేకాదు ఈ మధ్యకాలంలో లేడీ ఓరియెంటెడ్ సిన్మాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇండస్ట్రీలో 5 పదులు దాటిన సీనియర్ హీరోలకి హీరోయిన్స్ లేని లోటు కూడా తీరుస్తూ మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. అయితే ఇటీవలే నటి త్రిష ఓ ప్రమోషన్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇందులో తనకి తమిళనాడు స్టేట్ కి సీఎం కావాలని తన ఆశ అని మనసులోని మాట బయటపెట్టింది. అయితే తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు చెయ్యాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది. దీంతో రాజకీయాలపై త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు త్వరలోనే త్రిష కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన పార్టీలో చేరబోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కూడా సినీనటులు రాజకీయాల్లోకి రావడం వలన ప్రజలకి మంచి జరుగుతుందని అంటున్నారు.

అయితే త్రిష విజయ్ కలసి ఆమధ్య ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకారాజ్ డైరెక్షన్ లో వచ్చిన లియో సినిమాలో నటించారు. అంతేకాదు గతంలో గిల్లీ (ఒక్కడు రిమేక్) సినిమాలో కుడా నటించారు. దీంతో హీరో విజయ్ తో మంచి సన్నహిత సంబంధాలు ఉన్నాయని అందుకే త్వరలోనే తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరనున్నారని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ త్రిష మాత్రం తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఇప్పటివరకు స్పందించలేదు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి బింబిసారా మూవీ ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే విశ్వంభర సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ పనులు పూర్తీ కాకపోవడంతో సమ్మర్ కి వాయిదా పడింది.