మలయాళ బ్యూటీ ఆసిన్(Asin) సినిమాలకు దూరమై చాలా కాలమైంది. మైక్రోమ్యాక్స్(Micromax) కోఫౌండర్ రాహుల్ శర్మ(Rahul sharma)ను 2016లో ఈ నటి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఆరిన్(Arin) అనే కుమార్తె కూడా ఉంది. తన కుమార్తె ఆరో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కొన్ని ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.
అచ్చం ఆసిన్ లాగే ఉన్న ఆ పాపను చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మరికొందరేమో ఈ హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా? అని షాకవుతున్నారు. చివరి సారిగా అభిషేక్ బచ్చన్‌తో ‘ఆల్ ఈజ్ వెల్’ అనే సినిమాలో ఆమె నటించింది. తన పర్సనల్ లైఫ్‌ను రహస్యంగా ఉంచేందుకు ఆసిన్ ఇష్టపడుతోంది. ఇటీవల భర్తతో విడిపోయినట్టుగా వచ్చిన వార్తలను ఆమె ఖండించింది.