Deepika Padukone: విచిత్రంగా దీపికా పదుకునే గెటప్.. వైరల్గా మారిన లేటెస్ట్ లుక్.. అసలు నమ్మలేరు!

Deepika Padukone: విచిత్రంగా దీపికా పదుకునే గెటప్.. వైరల్గా మారిన లేటెస్ట్ లుక్.. అసలు నమ్మలేరు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కొత్త లుక్ చూస్తే కంగు తినాల్సిందే. అసలు ఈమె దీపికా అంటే ఎవ్వరు గుర్తుపట్టారేమో అనేంతలా మారిపోయింది. దీపికా పదుకొణె సెప్టెంబర్ 8, 2024న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మొదటి సారిగా కనిపించిన షో ఇది. అయితే, ఇప్పుడు దీపికా లేటెస్ట్ లుక్ చూస్తే చాలా మారినట్లుగా అనిపిస్తోంది. 

జనవరి 25న డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ 25వ వార్షికోత్సవ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది. ఈ షోలో బాలీవుడ్ ముద్దుగుమ్మల కోసం రన్‌వే ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో దీపికా పదుకొణె, సోనమ్ కపూర్, అలియా భట్, అనన్య పాండే, అదితి రావు హైదరీ, ఇతర హీరోయిన్స్ పాల్గొన్నారు. ఈ బాలీవుడ్ భామలు ఎంతో అందగా మెరిసి తమదైన వాకింగ్తో, గ్లామర్‌తో అట్రాక్ట్ చేశారు. వీరిలో దీపికా గెటప్ విచిత్రంగా ఉండటంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందులో దీపికా పదుకునే డిఫరెంట్ ఔట్‌ ఫిట్‌లో కనిపించింది. పూర్తిగా వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో మేకోవర్‌తో, ఓల్డ్‌ హెయిర్‌ స్టైల్‌తో దీపికా కనిపించి నెటిజన్లని ఆశ్చర్యపరిచింది. ఆమె లిప్‌స్టిక్‌ మొదలుకని ప్రతి ఒక్క విషయం గురించి సోషల్‌ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. సీనియర్ రేఖ మాదిరి కనిపిస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్లోజప్‌లో మాత్రమే ఈమె దీపికా పదుకునే అని గుర్తు పట్టే విధంగా ఉంది.

Also Read : హీరోయిన్స్తో పాటపాడుతూ.. డ్యాన్స్ ఇరగదీసిన వెంకీ మామ

ట్రెంచ్ కోటు, వైట్ సిల్క్ బటన్ డౌన్ షర్ట్, ఫ్లార్డ్ ప్యాంట్‌తో కూడిన ఆల్ వైట్ లుక్‌ను ఆమె ధరించింది. బ్లాక్ బూట్లు, లేయర్డ్ నెక్లెస్, మేకప్, బ్లాక్ లెదర్ గ్లౌజులు, నెర్డీ గ్లాసెస్, ఫ్రిడా కహ్లో ప్రేరేపిత హెయిర్ స్టయిల్‌తో దీపికా ఈ డ్రెస్‌ను డిజైన్ చేశారు.

గతంలో దీపికా ఫోటోలతో పోల్చితే ఈ ఫోటోల్లో చాలా తేడాగా ఉందని స్వయంగా ఆమె ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే, రన్‌వేపై పదుకొణె కనిపించిన తీరు నెటిజన్లను అంతగా ఆకట్టుకోలేదని కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. ఓ సారి ఆ వీడియో చూసేయండి.