DivyaBharathi: పెళ్ళైన వ్యక్తితో అసలు చేయను.. హీరోతో డేటింగ్‌పై స్పందించిన నటి దివ్యభారతి

DivyaBharathi: పెళ్ళైన వ్యక్తితో అసలు చేయను.. హీరోతో డేటింగ్‌పై స్పందించిన నటి దివ్యభారతి

తమిళ హీరో, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌ కుమార్ తన భార్య సైంధవితో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసందే. ఇటీవలే 2025 మార్చి 24న సైంధవి మరియు జీవీ ప్రకాష్ పరస్పర విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

అయితే జీవీ ప్రకాశ్‌ కుమార్ తన భార్యతో విడాకులు తీసుకోవడానికి, నటి దివ్య భారతి కారణమంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని.. పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. బ్యాచిలర్, కింగ్ స్టన్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించడంతో ఆ డేటింగ్ రూమర్స్ మరింత  ఊపందుకున్నాయి. లేటెస్ట్గా నటి దివ్య భారతి తనపై వస్తోన్న డేటింగ్ వార్తలను కొట్టేపారేసింది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.

‘‘నాకు సంబంధం లేని వ్యక్తుల కుటుంబ విషయాల్లోకి నా పేరును లాగుతున్నారు. జీవీ ప్రకాశ్‌ కుటుంబసమస్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. నేను ఎప్పుడు ఎవరితోనూ డేటింగ్‌లో లేను. ముఖ్యంగా పెళ్లి అయిన వ్యక్తితో అసలు డేటింగ్ చేయను. ఆధారం లేకుండా రూమర్స్‌ క్రియేట్ చేయకండి.

ALSO READ | OTT Thriller: ఓటీటీలోకి అప్సరా రాణి పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్‌..

ఇప్పటివరకు నేను మౌనంగా ఉన్నాను. అయితే, ఈ రూమర్స్‌ హద్దులు దాటుతున్నాయి. ఈ నిరాధారమైన ఆరోపణలతో నా పేరు ప్రతిష్టలు దెబ్బతింటోన్నాయి. ఇలాంటి నిరాధారమైన వార్తలు సృష్టించే బదులు సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి. నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి. ఈ అంశంపై ఇదే నా మొదటి.. చివరి ప్రకటన’’ అని దివ్య భారతి నోట్లో రాసుకొచ్చింది.

ఇటీవలే.. ఈ విషయం గురించి జీవీ ప్రకాష్, దివ్య భారతి తమ డేటింగ్‌ రూమర్స్ పై స్పందించారు. తామిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని, తమ మధ్య ప్రేమ, గీమా వంటివి ఏమీ లేవని స్పష్టం చేశారు. కొందరు తమ మధ్య ఉన్నటువంటి స్నేహ  బంధం, సాన్నిహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అందుకే ప్రేమ, డేటింగ్ వంటివి అంటగడుతున్నారని చెప్పుకొచ్చారు.