తెలుగులో ప్రముఖ హీరో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన మలయాళ హీరోయిన్ హానీ రోజ్ తెలుగు ఆడియన్స్ ని సుపరిచితమే. హానీ రోజ్ సోషమ్ మీడియాలో ఓ బిజినెస్ మెన్ వేధింపుల గురించి తెలియజేస్తూ సీరియస్ అయ్యింది. ఇందులోభాగంగా “ఒక వ్యక్తి యొక్క సంపద అతన్ని ఏ స్త్రీనైనా అవమానించేంత అహంకారాన్ని కలిగిస్తుందా? దీనికి వ్యతిరేకంగా భారతీయ చట్టం ఒక మహిళకు భద్రతను అందించలేదా?" అంతో ఇన్స్టాగ్రామ్ స్టోర్ షేర్ చేసింది.
అలాగే ఓ బిజినెస్ మెన్ తాను పాపులర్ కావడం కోసం పదేపదే తనపై మాటల దాడికి పాల్పడుతున్నాడని వాపోయింది. నేను 20ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని నాకు ఇలాంటి డ్రామా అవసరం లేదని అన్నారు. ఇక నాలాగే ఇతర ప్రముఖులు అతని వ్యాపారాల ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ అతను పదేపదే నన్ను లక్ష్యంగా చేసుకుని తన ఇంటర్వ్యూలలో నా పేరును ఉపయోగిస్తూ అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆవేదని వ్యక్తం చేసింది. దీంతో ఒకట్రెండు సార్లు ఈ విషయం గురించి ఆ బిజినెస్ మెన్ మేనేజర్ ద్వారా మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉంటూ మరోసారి తనగురించి మాట్లాడానని చెప్పాడని కానీ మళ్ళీ అతడితీరు మారలేదని తెలిపింది.
ఇక అతడి చేష్టలకు విసుగు వచ్చిందని ఇకపై ఇంటర్వూలలో లేదా ఇతర సందర్భాల్లో తన పేరుని ప్రస్తావిస్తూ కామెంట్లు చేస్తే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. కానీ తనని వేధింపులకు గురి చేసిన బిజినెస్ మెన్ ఎవరనేది మాత్రం పేరు చెప్పలేదు. దీంతో కొందరు నెటిజన్లు స్పందిస్తూ నటి హానీ రోజ్ కి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో కొందరు సినీ సెలెబ్రెటీలకు డబ్బు ఆశ చూపి లోబర్చుకోవాలని చూస్తున్నారని అలాంటివాళ్ళకి హానీ రోజ్ సరిగ్గా బుద్ది చెప్పిందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.