బాలీవుడ్ బ్యూటీ, దివంగత నటి శ్రీదేవి డాటర్ జాన్వీకపూర్ వరుస మూవీస్తో బిజీగా ఉంది. ఖాళీ దొరికితే తరచూ తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ దర్శించుకుంటూనే ఉంటుంది. ఆమెకు తిరుపతి బాలాజీ అంటే ఎంతో ఇష్టం. అంతే కాదు ఇప్పటికీ చాలామార్లు జాన్వీ తిరుమల దర్శనానికి వచ్చారు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
లేటెస్ట్గా కరణ్ జోహార్ షోలో జాన్వీ మాట్లాడుతూ.."తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పుకొచ్చింది. అలాగే, తిరుపతిలోనే సెటిల్ అవ్వాలని.. ప్రతిరోజూ అరటి ఆకులో అన్నం తినాలని, గోవిందా గోవిందా అని స్మరించు కోవాలని చెప్పుకొచ్చింది జాన్వీ. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి.. ముగ్గురు పిల్లలతో తిరుపతిలో హాయిగా గడపాలని ఉందని తెలిపింది. అంతేకాకుండా, మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలని ఆశపడుతూ తన ఫ్యూచర్ ప్లానింగ్స్ చెప్పుకొచ్చింది జాన్వీ.
ALSO READ | దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత.. ఐటీ అధికారుల వాహనంలోనే ఆసుపత్రికి తరలింపు
ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా జాన్వీ కపూర్ పెళ్లి విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆమె నటుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందని, త్వరలోనే వీరి పెళ్లి జరుగనుందని వార్తలు వైరల్ అయ్యాయి. జాన్వీ తన పేరుతో నెక్లెస్‌ని ధరించడం నుండి కలిసి వివాహాలకు హాజరయ్యే వరకు వారి ప్రేమ ఎప్పుడు నెటిజెన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇకపోతే వీరిద్దరూ కలిసి తరుచుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
ఇకపోతే, జాన్వీకపూర్ తెలుగు సినిమాల్లో బిజీగా ఉంది. గతేడాదిలో ఎన్టీఆర్ తో కలిసి దేవరలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న RC(వర్కింగ్ టైటిల్) జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ ను బ్యాలెన్స్ చేస్తూ జాన్వీకపూర్ వరుస సినిమాల్లో నటిస్తుంది.