అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సినీ సెలబ్రిటీల జాబితాలో కరీనా కపూర్ మొదటి స్థానంలో నిలిచింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను కరీనా రూ. 24 కోట్ల పన్ను చెల్లించడం విశేషం. ఇక ఆమె కట్టిన ట్యాక్స్ తో పోలిస్తే..రెండో స్థానంలో ఉన్న వాళ్లు కట్టింది చాలా చాలా తక్కువే.
అయితే,రూ.12 కోట్ల రూపాయల పన్ను చెల్లించి కియారా అడ్వాణీ రెండో స్థానంలో నిలిచింది. అలాగే రెండో స్థానంలో ఉన్న ఫిమేల్ సెలబ్రిటీలు దీపికా పదుకోన్, ఆలియా భట్, అనుష్క శర్మ తలా రూ.12 కోట్ల ట్యాక్స్ చెల్లించారు. రూ.11 కోట్ల పన్ను చెల్లించి కత్రినా కైఫ్ మూడో స్థానంలో నిలిచింది.
Also Read :- చరణ్ ఫ్యాన్స్ హ మజాకా..దెబ్బకు దిగొచ్చిన గేమ్ ఛేంజర్ మేకర్స్
మొత్తంగా సెలబ్రిటీల జాబితాలో హీరో షారూఖ్ ఖాన్ 92 కోట్ల రూపాయల టాక్స్ కట్టి సెలబ్రిటీల్లో టాప్ పొజిషన్ లో నిలిచారు. దళపతి విజయ్ 80 కోట్ల రూపాయలు, సల్మాన్ ఖాన్ రూ.75 కోట్లు, అమితాబచ్చన్ 72 కోట్ల రూపాయల పన్ను చెల్లించారు.
సినిమా ఇండస్ట్రీలోకి కరీనా వచ్చి రెండు దశాబ్దాలకుపైనే అయింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు. ప్రస్తుతం కరీనా కపూర్ తన నెక్ట్స్ మూవీ బకింగ్‌హామ్ మర్డర్స్ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది.