Malavika Mohanan: "ఆర్ యూ వర్జిన్.?" అని అడిగిన నెటిజన్.. దాంతో స్టార్ హీరోయిన్ కి మండి ఏకంగా..

Malavika Mohanan: "ఆర్ యూ వర్జిన్.?" అని అడిగిన నెటిజన్.. దాంతో స్టార్ హీరోయిన్ కి మండి ఏకంగా..

Malavika Mohanan:ఈమధ్య సోషల్ మీడియా వినియోగం బాగా ఎక్కువైంది.. దీంతో సినీ సెలబ్రెటీలు, ప్రజల మధ్య దూరం బాగా తగ్గిందని చెప్పవచ్చు..  అయితే సినీ స్టార్లు కూడా తమ అభిమానులతో ముచ్చటించేందుకు ఈ సోషల్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలని ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవలే మలయాళ స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్ తన అభిమానులతో ముచ్చటించేందుకు ట్విట్టర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులోభాగంగా పలువురు నెటిజన్లు, అభిమానులు మాళవిక సినీ కెరీర్ గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.. ఇక్కడి వరకూ అంతా బాగుంది..

ALSO READ | Sneha: హీరోయిన్ స్నేహ కి అలాంటి ప్రాబ్లమ్ ఉందంట.. అందుకే అన్నింటిని అలా చేస్తూ..

కానీ ఓ నెటిజన్ హద్దు మీరి.. ఏకంగా "ఆర్ యూ వర్జిన్.?" అని వ్యక్తిగత ప్రశ్న అడిగాడు.. దీంతో మాళవిక ఏమాత్రం సంకోచించకుండా నా వ్యక్తిగత విషయం గురించి మీకెందుకు అంటూ రిప్లై ఇచ్చింది.. అలాగే సినీ సెలబ్రెటీలని లైవ్ లో, బహిరంగ ప్రదేశాలలో ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగటం మానెయ్యండి అంటూ సీరియస్ అయ్యింది.. దెబ్బకి జడుసుకున్న ఆ నెటిజన్ ట్వీట్ ని డిలీట్ చేశాడు. అయితే మాళవిక చేసిన ఈ పనికి అభినందిస్తున్నారు.. అలాగే ఈమధ్య కొందరు పాపులర్ కావాలని ఇలాంటి చెత్త ప్రశ్నలతో సినీ సెలెబ్రటీలని ఇబ్బందులకి గురి చేస్తున్నారని ఇది సరికాదని అంటున్నారు.. అలాగే చెత్త ప్రశ్నలతో విసిగించేవారికి మాళవిక సరిగ్గా సమాధానం ఇచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. 

ఈ విషయం ఇలా ఉండగా ఆమధ్య కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన "మాస్టర్" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మలయాళ బ్యూటీ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా నార్త్, సౌత్ అంటూ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపుతోంది.. ప్రస్తుతం తెలుగులో ప్రముఖ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఫ్యామిలీ మూవీస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న "ది రాజాసాబ్" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళ్ డైరెక్టర్ పీ.యస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ "సర్దార్ 2" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.