రెండో పెళ్లిపై ఒత్తిడి పెరిగింది.. క్లారిటీ ఇచ్చిన మీనా

సీనియర్ హీరోయిన్ మీనా(Meena) రెండో పెళ్లిపై ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆమె సన్నిహితులు ఖండించారు. మీనాను రెండోపెళ్లి చేసుకోమని ఎంతో మంది చెప్తున్నారని తెలిపారు. భర్త మరణం ఆమెను మానసికంగా కుంగదీసిందని..తన కుమార్తె కోసమే ఆమె జీవిస్తుందని వివరించారు. రెండో పెళ్లి గురించి ఆలోచించే స్థితిలో లేదని క్లారిటీ ఇచ్చారు. నటిగా వెలుగొందుతున్నటైంలోనే  మీనా సినిమాలకు దూరమైంది. 

బెంగళూరుకు చెందిన బిజినెస్మెన్ విద్యాసాగర్ ను 2009లో ఆమె పెళ్లాడింది. వీరిద్దరికి నైనిక అనే కుమార్తె కూడా ఉంది. గతేడాది మీనా జీవితంలో విషాదం జరిగింది. ఆమె భర్త అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నటి రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ALSO READ: వీల్చైర్ లో వచ్చి జవాన్ సినిమా చూసిన వెంటిలేటర్ పేషెంట్

ఇక రీసెంట్ గా ఇటీవల మీనా కూతురు నైనిక కూడా ఈ పుకార్లపై రియాక్ట్ అవుతూ ఎమోషనల్‌ అయ్యింది. ఒక సినిమా ఈవెంట్‌కు తల్లితో హాజరైన నైనిక.. ‘ మా అమ్మ కూడా మనిషే.. ఇలాంటి పుకార్లు, వార్తలు రావడం వలన ఆమె ఎంత బాధపడుతుందో మీకు తెలుసా.. అంటూ అందరిముందే కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక మీనా సినిమాల విషయానికొస్తే.. గతేడాది మలయాళ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి బ్రో డాడీ సినిమాలో నటించింది. ఈ ఏడాది ఆమె నటించిన ఆర్గానిక్‌ మామ, హైబ్రిడ్‌ అల్లుడు మూవీస్ కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రసెంట్ రౌడీ బేబీ, దృశ్యం 3 లో నటిస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meena Sagar (@meenasagar16)