పెళ్లి పీటలు ఎక్కబోతున్న లై భామ.. వరుడు ఎవరంటే?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న లై భామ.. వరుడు ఎవరంటే?

లై(Lie) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మేఘా ఆకాష్(Megha Akash) పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబైకి చెందిన ఈ బడా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందట ఈ బ్యూటీ. అతను మేఘా ఆకాష్ కుటుంబానికి సన్నిహితుడనే టాక్ నడుస్తోంది. ఇరు కుటుంబాలు కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పేశాయట. అయితే ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

మేఘా ఆకాష్ కూడా గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. రీసెంట్ గా ఆమె నటించిన రావణాసుర(Ravanasura) సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం మేఘా.. తమిళ్ లో ఒక ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పింది.