మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నైలో పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. వర్షం, వరదల కారణంగా జనజీవన అస్థవ్యస్థంగా మారింది. చాలా చోట్ల ఇంట్లోకి నీళ్లు చేరడతో ప్రజలు ఇబ్బందలు పడుతున్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే చాలా చోట్లలో సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా పంపినే చేసే ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ చాలా చోట్ల సాధారణ ప్రజలు ఆకలితో భాధలుపడుతున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకి కూడా జనాలు వేలాదిగా వస్తుండటంతో అక్కడ కూడా సహాయక చర్యలు అందక
తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సినీ ప్రముఖులు వారికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరోలు విజయ్, సూర్య, విశాల్.. తమ ఫ్యాన్స్ సాయం అందిస్తుండగా.. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ నయనతార కూడా సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. తన సొంత వ్యాపార సంస్థ ఫెమీ 9 ఆధ్వర్యంలో.. వరద బాధితులకు నిత్యావసర సరకులు, దుస్తులు,ఆహారం, వాటర్ బాటిళ్లు, మెడిసిన్స్, పాలు వంటివి పంపిణీ చేశారు. దీంతో ఆమె చేస్తున్న సహాయానికీ నెటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కానీ.. కొంతమంది మాత్రం ఈ విషయంలో నయనతారను తప్పుబడుతున్నారు. ఆమె తన కంపెనీ ఫెమీ 9 అడ్వర్టైజ్‌మెంట్ కోసమే ఇలా చేస్తుందని, ఫెమీ 9 బోర్డులు ఉన్న వాహనంలో సహాయం అందించడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా నయన్ తన కంపెనీని ప్రమోట్ చేసుకోవడం ఏంటి? అంటూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు. దీంతో నయన్ అభిమానులు ఆమెను విమర్శిస్తున్న వారికి గట్టి కౌంటర్లు వస్తున్నారు. మీరు చేయరు కనీసం చేసేవాళ్ళకి చేయనివ్వండి. తప్పులు వెతకడం కాదు.. సోషల్ మీడియా వదిలి ముందుకు నిజంలోకి రండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.