పాపం పవన్ హీరోయిన్.. నిధి అగర్వాల్ను చంపేస్తామని బెదిరింపులు.. భయంతో పోలీసులను ఆశ్రయించిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ

టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhhi Agerwal) కు ఆకతాయిల వేధింపులు తప్పడం లేదు. సోషల్ మీడియాలో తనను అత్యాచారం, హత్య చేస్తామని బెదిరిస్తున్న వ్యక్తిపై నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని తాను ఇచ్చిన ఫిర్యాదులో కోరింది. దాంతో నటి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు తక్షణమే విచారణ చేపట్టారు.

అయితే, నిధి అగర్వాల్ ను బెదిరిస్తున్న ఆ వ్యక్తి తనతో పాటు ఇష్టమైన వారిని, తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా ఫిర్యాదులో తెలిపింది. అయితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినీ హీరోయిన్స్ పై ఆకతాయిల వేధింపులు ఎక్కువతున్నాయి. నిధి అగర్వాల్ ఎక్కడ ఫిర్యాదు చేసిందనే వివరాలు మాత్రం బయటికి రాలేదు. 

నిన్నటికి నిన్న మలయాళ హీరోయిన్ హనీ రోజ్ ని వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యాపారవేత్తను కేరళ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.అంతేకాకుండా తనపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ పెడుతున్న మరో 30 మందిపై కేసు నమోదు చేశారు. ఇది ఓ కొలిక్కి రాకముందే మరో హీరోయిన్ ఆకతాయిల వేధింపులకు గురవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Also Read : షూటింగ్ కోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్

‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్. మూడో సినిమా ‘ఇస్మార్ట్‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌’తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్‌‌‌‌పై ఫోకస్ పెట్టిన ఆమె, తిరిగి తెలుగులో బిజీ అవుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌‌‌‌కు జంటగా ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తోంది. అలాగే ప్రభాస్‌‌‌‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ‘రాజా సాబ్ లో హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.