పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకటలచ్చిమి’. ముని దర్శకత్వంలో రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. శుక్రవారం రామానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ మాట్లాడుతూ ‘‘మంగళవారం’ చిత్రం తర్వాత చాలా కథలు విన్నప్పటికీ నచ్చక రిజెక్ట్ చేశాను. ముని గారు ఈ కథ చెప్పగానే చాలా నచ్చింది.
ఈ మూవీ తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా మారేంత బలమైన సబ్జెక్ట్ ఇది. ఈ పాన్ ఇండియా మూవీ నా కెరీర్‌ను నెక్స్ట్ రేంజ్‌కు తీసుకెళుతుందనే నమ్మకముంది’ అని చెప్పింది. ‘ఓ ట్రైబల్ అమ్మాయి యాక్షన్ రివేంజ్ డ్రామా ఇది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, పంజాబీ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు ముని తెలియజేశాడు.