
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde).. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ (ఏప్రిల్ 3న) ఆమె స్వామి, అమ్మవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది.
Also Read :- సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ ట్రైలర్
దర్శన అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు శేష వస్త్రంతో సత్కరించి, వేద ఆశీర్వచనాలతో.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Heroine Pooja Hegde participated in Rahu Ketu Pooja at Sri kalahasti Temple pic.twitter.com/mcGwyVoXiR
— Gorati Naresh (@NareshWriting) April 3, 2025
పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే..
ప్రస్తుతం తన రెండో ఇన్నింగ్స్ను విభిన్నంగా స్టార్ట్ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న రెట్రో (Retro)లో హీరోయిన్గా కనిపిస్తుంది. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న రెట్రో మూవీ మే 1న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. అలాగే, రజినీకాంత్ కూలీ సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది. రాఘవ లారెన్స్ ‘కాంచన 4’లో నటించనున్నట్లు సమాచారం. హిందీలో ఓ మూవీ చేస్తోంది.