Pooja Hegde: కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ పూజా హెగ్డే..

Pooja Hegde: కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ పూజా హెగ్డే..

హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) వరుస దైవ దర్శనాల్లో పాల్గొంటున్నారు. గురువారం (ఏప్రిల్ 3న) తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఫ్యామిలీతో కలిసి రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు కూడా చేయించుకున్నారు. 

ఈ క్రమంలో నేడు (ఏప్రిల్ 4న) పూజా తన కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి, దగ్గరుండి మరీ దర్శన ఏర్పాట్లు చేశారు.

ALSO READ : Pooja Hegde: రాహుకేతు పూజలో పాల్గొన్న హీరోయిన్ పూజా హెగ్డే.. వీడియో వైరల్

దర్శన అనంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూజా హెగ్డే తమిళంలో నటించిన రెట్రో (Retro) మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. మే 1న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. అలాగే, రజినీకాంత్ కూలీ సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది.