బాలకృష్ణతో వరుస సినిమాలు చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను అంటోంది ప్రగ్యా జైస్వాల్. ‘అఖండ’ తర్వాత బాలయ్యతో ఆమె నటించిన సినిమా ‘డాకు మహారాజ్’. బాబీ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ ‘‘ఇందులో నటనకు ఆస్కారమున్న పాత్ర చేశా. కావేరి రోల్‌లో డీ గ్లామరస్‌గా కనిపిస్తా. నేను ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. నటిగా నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. దర్శకుడు నా క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది. నేను ఊహించిన దానికంటే గొప్పగా తీశారు. అలాగే బాలకృష్ణ గారిని చాలా కొత్తగా చూపించారు.సెట్స్‌లో బాలకృష్ణ గారు ఎంతో సరదాగా ఉంటారు. సినిమాకి సంబంధించి ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చారంటే, నటుడిగా దర్శకుడికి ఏం కావాలంటే అది నూటికి నూరు శాతం ఇస్తారు.
ALSO READ : GameChanger: థియేటర్లలో నానా హైరానా సాంగ్ మిస్.. రామ్ చరణ్ ఫ్యాన్స్కు మేకర్స్ క్లారిటీ
‘అఖండ’ నా సినీ కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. నా పుట్టినరోజైన జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుండడం అదృష్టం. ఇది నా బర్త్‌డే గిఫ్ట్‌గా భావిస్తున్నా. అలాగే సంక్రాంతికి వస్తుండడం సంతోషంగా ఉంది’’ అని చెప్పింది.