
కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ గురించి పరిచయం అక్కర్లేదు. 'ఓంధ్ కథే హెల్లా' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు..2019లో ‘నాని గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు అభిమానులను పలకరించింది. తర్వాత 'శ్రీకారం', 'సరిపోదా శనివారం' వంటి సినిమాల్లోనూ మెప్పించింది.
తన అందం, గ్లామర్, అద్భుతమైన నటనతో ఫ్యాన్స్‌ని కట్టిపడేసింది. ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ సరసన 'ఓజీ' మూవీ కూడా చేస్తుంది. త్వరలో సూర్య హీరోగా, పాండిరాజ్ దర్శకత్వంలో రానున్న సినిమాలో కూడా ప్రియాంక నటిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఇస్తాంబుల్లో సేద తీరుతోంది. వేసవి కావడంతో అక్కడ విడిదికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది.
Also Read : ‘జాక్’ ఫుల్ రివ్యూ.. సిద్ధు స్పై యాక్షన్ కామెడీ మెప్పించిందా?
'ఇస్తాంబుల్ చరిత్ర, విభిన్న సంస్కృతి, ప్రకృతి దృశ్యాలు తన హృదయాన్ని' పూర్తిగా ఎలా ఆకట్టుకున్నాయో ఈ పోస్టులో తెలిపింది. ఆమె ఫొటోలను చూసిన అభిమానులు లైకులు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు.