పచ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. మమతా బెనర్జీ రిలీజ్ చేసిన ఆ జాబితాలో 42 మందిలో ఫేమస్ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తోపాటు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రచన బెనర్జీ కూడా ఉన్నారు. అంతే కాదు బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హాకు కూడా టికెట్ ఇచ్చారు. రచన బెనర్జీకి పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు.
ALSO READ :- అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం: రాహుల్ గాంధీ
ఈమె తెలుగుతో పాటు తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లోనూ నటించింది. మెగాస్టార్ చిరంజీవితో బావగారూ బాగున్నారా,మావిడాకులు, కన్యాదానం, అభిషేకం, రాయుడు,లాహిరి లాహిరి లాహిరిలో, సుల్తాన్ తెలుగు సినిమాల్లో నటించింది. కొంతకాలంగా సినిమాలకు దూరమైన రచన.. బెంగాలీ సీరియల్స్, టీవీ షోలకు పరిమితమైంది. టీఎంసీ తరఫున రాజకీయాల్లోనే బిజీగానే గడిపేస్తోంది.