రెజీనా, దిలీప్ ప్రకాష్ లీడ్ రోల్స్‌లో అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన చిత్రం ‘ఉత్సవం’. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సెప్టెంబర్ 13న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనా చెప్పిన విశేషాలు.
‘‘నాటక రంగం గురించి చాలా రీసెర్చ్ చేసి అర్జున్ సాయి ఈ కథను రాసుకున్నారు. కథ వినగానే ఇందులో సోల్ ఉందనిపించింది. అలాగే ఇది అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న రూటెడ్ స్టోరీ. ఇందులో నేను కార్పొరేట్ ఎంప్లాయ్‌గా కనిపిస్తా. ఇండిపెండెంట్ ఉమెన్ రిలేట్ చేసుకునేలా నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ రోల్ చేయడం చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇందులో రంగస్థలం నటుల గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. అవి ఆడియెన్స్‌ను హత్తుకునేలా ఉంటాయి. దిలీప్ ప్రకాష్ చాలా పాజిటివ్ పర్సన్.
తనతో వర్క్ చేయడం ఎంజాయ్ చేశా. అలాగే ఈ సినిమాలో అందరూ చాలా సిన్సియర్‌గా పని చేశారు. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు థియేటర్స్ నుంచే వచ్చారు. వారితో వర్క్ చేయడంతో చాలా విషయాలు నేర్చుకున్నా. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ సపోర్ట్‌తో విడుదలవడం ఆనందంగా ఉంది. ఇక అన్ని రకాల పాత్రలు చేయడమే నా గోల్. ప్రస్తుతం సన్నీడియోల్‌తో గోపిచంద్ మలినేని తీస్తున్న సినిమాలో నటిస్తున్నా. హిందీలో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి’’.