
సప్తసాగరాలు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth).ఆ తర్వాత వచ్చిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో రుక్మిణికి తీవ్ర నిరాశ మిగిలింది.
ఇదిలా ఉంటే, రీసెంట్గా రుక్మిణి ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్లో తనకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పేసింది. తెలుగులో మీకు ఏ హీరో అంటే ఇష్టం? “ఎవరితో కలిసి నటించాలనుందని అడగానే, తనకు నేచురల్ స్టార్ నానితో (Nani)కలిసి పని చేయాలని ఉన్నట్లు తెలిపింది.
నాని రేంజ్ డిఫరెంట్ అని, అతను చేసే సినిమాల్లో ఒక అర్ధముంటోంది. అంటే సుందరానికీ, శ్యామ్ సింగరాయ్ లాగా ప్రతీ సినిమా కొత్తగా ఉండటంతో పాటూ ఆయన సినిమాల్లో హ్యూమర్ ఉంటుందని చెప్పింది. దాంతో ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో అని తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ | Pooja Hegde: 13 ఏళ్ల తర్వాత తొలిసారి తన సొంత గొంతుతో హీరోయిన్ పూజా హెగ్డే...
ఇకపోతే, రుక్మిణీ వసంత్ ఓ భారీ అంచనాలతో వస్తోన్న మూవీతో తెలుగు తెరకు రానుందని టాక్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా రుక్మిణీ వసంత్ని తీసుకున్నట్లు సమాచారం. అయితే రుక్మిణీ వసంత్కి కన్నడలో మంచి క్రేజ్ ఉంది. దాంతో అక్కడ వరుస సినిమాలతో బిజీగా మారింది.
ఈ క్రమంలో తన నటన,లుక్స్, సహజంగా ఉండటం వల్ల తెలుగు ఆడియన్స్ కూడా హక్కున చేర్చుకుంటారని బలంగా నమ్ముతుందట ఈ అమ్మడు. ఇక రుక్మిణీ వసంత్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి మరి.