Sai Pallavi: హాస్పిటల్ లో సాయి పల్లవి.. ఏమైందంటే..?

Sai Pallavi: హాస్పిటల్ లో సాయి పల్లవి.. ఏమైందంటే..?

Sai Pallavi: మలయాళ ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఒకరకంగా చెప్పాలంటే సాయి పల్లవిని చూడటానికే థియేటర్స్ కి వెళ్లే అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో తండేల్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరోగా టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య నటిస్తుండగా ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. 

ఇటీవలే తండేల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. కానీ ఈ ఈవెంట్ కి సాయి పల్లవి రాకపోవడంతో ఏమైందోనని సాయి పల్లవి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇంకొందరు లేనిపోని గాసిప్స్, రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.

దీంతో డైరెక్టర్ చందూ మొండేటి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. ఇందులోభాగంగా సాయి పల్లవి రెండుమూడు రోజులగా తీవ్రమైన జ్వరం, జలుబు వంటివాటితో భాద పడుతుందని అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రాలేకపోయిందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే ప్రస్తుతం ఆమె బాగానే ఉందని కానీ 3 రోజులపాటూ రెస్ట్ అవసరమని డాక్టర్లు సాయిపల్లవికి సూచించినట్లు తెలిపాడు. కాబట్టి ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ కి సూచించాడు.

ALSO READ | Allu Arjun: తొక్కిసలాట ఘటన తర్వాత.. తొలిసారి సినిమా ఈవెంట్‍కు అల్లు అర్జున్.. కానీ, వాళ్లకు నో ఎంట్రీ!

ఈ విషయం ఇలా ఉండగా తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆదివారం (ఫిబ్రవరి 2న) తండేల్ సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. 

ఈ ఈవెంట్ కి పుష్ప 2: ది రూల్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రానున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి తెలిపారు. దీంతో అక్కినేని, బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతన్నారు.