రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ఫౌజీ (Fauji)సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi)నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 1970 కాలం నాటి సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తున్నాడు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో ఓ కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండనుందట. అందులో ప్రభాస్ యోధుడిగా కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో ప్రభాస్ ప్రేయసిగా సాయి పల్లవి నటిస్తుందట. ఈ ఎపిసోడ్లో వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్గా నిలిచేలా హను తెరకెక్కిస్తున్నారట. అదే కనుక నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్కి పండుగనే చెప్పుకోవాలి. త్వరలో సాయి పల్లవి పాత్రపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అయితే, సైనికుడిగా కనిపిస్తున్న ప్రభాస్కు జోడిగా ఇమాన్వీ నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవాళ ఫిబ్రవరి 5నుంచే కొత్త షెడ్యూల్ మొదలవుతోంది. ఆమధ్య షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయం అవడంతో డాక్టర్స్ సలహా మేరకు రెస్ట్ తీసుకున్న ప్రభాస్.. తిరిగి ఈ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. సుమారు రెండు నెలల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో లీడ్ యాక్టర్స్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.
Also Raed : ఓటిటిలోకి వచ్చేసున్న నిహారిక రొమాంటిక్ సాంగ్ సినిమా
ఫౌజీ బ్యాక్డ్రాప్:
ప్రభాస్తో..హను రాఘవపూడి తెరకెక్కించనున్న ఫౌజీ సినిమా 1970ల నాటి వార్ పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది. రజాకార్ల ఉద్యమం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు గాను ఇమాన్వీ రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకోనుందని టాక్. ఈ చిత్రంలో నటీనటులు జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.