హాస్పిటల్‌లో చేరిన సమంత.. అయ్యో మళ్లీ ఏమైంది..!

హాస్పిటల్‌లో చేరిన సమంత.. అయ్యో మళ్లీ ఏమైంది..!

టాలీవుడ్ బ్యూటీ సమంత(Samantha) వరుస సినిమాలతో కంటే, సోషల్ మీడియా పోస్ట్ లతో వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే తన ప్రైవేట్ పార్ట్ లో ఉన్న చైతు టాటూను తొలగించి సోషల్  మీడియాలో వచ్చిన రూమర్స్ కు చెక్ పెట్టింది. తాజాగా మరో ఫోటోను పోస్ట్ చేసి అభిమానులను షాక్ కు గురి చేసింది. 

ఆసుపత్రిలో సమంత..నిజమేనా..

సమంత తన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకున్న ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు అయ్యో సమంతకు ఏమైంది అంటూ తెగ బాధపడిపోతున్నారు. మళ్లీ ఏం వ్యాధి వచ్చింది...సమంత ఫీవర్ తో  ఇబ్బంది పడుతుందా అని అభిమానులు తెగ ఆందోళన పడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే..

సమంత చేతికి సెలైన్..కారణమిదే

సమంత తన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకోొవడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. ఆసుపత్రిలో బెడ్ పై పడుకుని సెలైన్ బాటిల్ పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ సమంత ఈ పోస్ట్ చేసింది. మయోసైటీస్‌తో బాధపడుతోన్న సమంత.. రోగ నిరోధక శక్తిని మరింత పెంచుకునేందుకు ఈ ఇమ్యూనిటీ బూస్టర్ సెలైన్ ను పెట్టుకున్నట్లు పేర్కొంది. అలాగే ఈ ఇమ్యూనిటీ బూస్టర్ సెలైన్ పెట్టుకోవడం వలన రక్త కణాల ఉత్పత్తి పెరిగి, గుండె పనితీరు మరింత మెరుగు పడుతుందని చెప్తోంది.  అంతేకాకుండా..కండరాలలో శక్తి, ఎముకల బలాన్ని కూడా పెంచుకోవచ్చని సమంత తన పోస్ట్లో వెల్లడించింది. 

ALSO READ: హాయ్ నాన్న టీజర్ అప్డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే ?
 
సమంత గత కొన్ని నెలలుగా మయోసైటీస్‌తో బాధపడుతోంది. దీంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుని..విదేశాలకు చికిత్స కోసం వెళ్ళింది.  ఈ మయోసైటీస్‌  చికిత్స తీసుకుంటూ..తన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకుంటోంది. 

ప్రస్తుతం సమంత..రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వస్తోన్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో  స్ట్రీమింగ్ కానుంది. ఇక సమంత త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించనుందని తెలుస్తోంది. కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ గా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై..పవన్ కళ్యాణ్ పంజా డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ మూవీని తెరకెక్కనున్నట్లు సమాచారం.