మలయాళి బ్యూటీ సంయుక్త మీనన్ టాలీవుడ్లో తనకంటూ ఓ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలైన ధనుష్ సినిమా సార్, కల్యాణ్ రామ్ బింబిసార, పవన్ కల్యాణ్ బీమ్లా నాయక్ చిత్రాల్లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూడు సినిమాలు సినీ ప్రేక్షకుల మన్ననలు పొందాయి.
దీంతో సంయుక్త క్రేజ్అమాంతం పెరిగింది. ఆమెకు వరుస సిసిమా చాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే సాయిధరమ్‌తేజ్ విరూపాక్షలోనూ నటిస్తుండగా.. మరో రెండు సినిమాలు ఆఫర్లో ఉన్నట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్‌ను పెద్దగా పట్టించుకోని సంయుక్త ఇప్పుడు హిట్లతో డిమాండ్ చేస్తున్నదని వినికిడి. ఓ సైడ్ఫొటోషూట్స్, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.