Bigg Boss OTT 3: హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌3 విజేతగా సనా మక్బుల్‌..ప్రైజ్ మనీ ఎంతంటే?

కింగ్ ఆఫ్ రియాలిటీ షోస్ అనిపించుకున్న బిగ్‌‌‌‌బాస్ ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 టీజర్ వచ్చేసింది. మరోవైపు హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్ రియాలీటి షోస్ లో ఒకటైన బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 3 (Biggboss OTT Season 3 Hindi) పూర్తయింది. అలాగే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వేటలో స్టార్ మా ఉండగా..హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 3 విజేత‌ను జియో సినిమా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. 

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 3 విజేత‌గా నటి సనా మక్బుల్‌ (Sana Makbul) నిలిచారు. సనా మక్బుల్‌కు, నేజీకు మధ్య చివరివరకు ఉత్కంఠ పోటీ ఉండగా..చివరకు సనానే విజేత అంటూ సీజన్‌3 హోస్ట్ అనిల్‌ కపూర్‌ అనౌన్స్ చేశారు. ఓటీటీ సీజన్‌ 3 లో గెలిచిన సనాకు  టైటిల్‌తో పాటు రూ.25 లక్షల బహుమతిని బిగ్ బాస్ హౌస్ అందించింది.

జూన్‌ 21న ప్రారంభమైన ఈ సీజన్‌ ఆగస్టు 2తో పూర్తయింది. గతంలో కరణ్‌జోహర్‌, సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం మూడో సీజన్‌కు (Bigg Boss OTT 3) ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ హోస్ట్‌గా ఉన్న విషయం తెలిసిందే. 

సనా మక్బుల్‌ విషయానికి వస్తే.. 

ముంబయిలో పుట్టిన సనా మోడలింగ్‌ ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది. పలు సీరియల్స్‌తో అలరిస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. తెలుగులో నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘దిక్కులు చూడకు రామయ్య’లో కనిపించి మెప్పించారు. అజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన ఈ చిత్రంలో న‌టించింది. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sana Makbul (@divasana)