Shalini pandey: రొమాంటిక్ సీన్స్ చేయలేక బయటికి వెళ్ళిపోయాను.. ఎందుకంటే?

Shalini pandey: రొమాంటిక్ సీన్స్ చేయలేక బయటికి వెళ్ళిపోయాను.. ఎందుకంటే?

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఒక హీరోతో రొమాంటింక్ చేయడం చాలా కష్టంగా అనిపించిందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో ఆ హీరో ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం షాలిని చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. షాలిని పాండే నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ్. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమాను సిద్ధార్థ్ మల్హోత్రా తెరకేక్కించారు. పలు వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కీ రోల్ చేశారు షాలిని పాండే. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా పై విదంగా కామెంట్స్ చేశారు షాలిని. 

షాలిని పాండే మాట్లాడుతూ.. మహారాజ్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాను. ఎందుకంటే.. ఆ సీన్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలియదు. అంతేకాదు.. నాకు చీకటి గదిలో ఉండటం అంటే చాలా భయం. ఆ సమయంలో నాకు కాస్త సమయం కావాలని, ప్రశాంతమైన వాతావరణం కావాలని డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా నా పరిస్థితిన అర్థం చేసుకున్నారు.. అంటూ చెప్పుకొచ్చింది షాలిని. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.