విభిన్న కథనాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే తెలుగు ప్రముఖ హీరో నవీన్ చంద్ర ‘లెవెన్’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహిస్తుండగా తెలుగు, తమిళ బై లింగ్విల్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అజ్మల్ ఖాన్, రేయా హరి కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్’ పాటని ప్రముఖ స్టార్ హీరో మరియు నిర్మాత కమల్ హాసన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. దీంతో నటుడు కమల్ హాసన్ చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే పాటని కోలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ పాడింది. దర్శకుడు లోకేశ్ అజ్ల్స్ లిరిక్స్ రాశారు.
ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ ఇదొక రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని, తన కెరీర్‌లోనే బెస్ట్ థ్రిల్లర్ అవుతుందని అన్నాడు. అలాగే ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసేలా సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.