శృతి హాసన్ కు వేధింపులు..వెంటపడ్డ అగంతుకుడు

టాలీవుడ్ లో శృతి హాసన్(Shruthi Hasan) వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కెరీర్ మొదటిలో ఆమెకు ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. పరాజయలకు క్రుంగి పోకుండా మరింత హార్డ్ వర్క్ చేసి తెలుగులో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. 

లేటెస్ట్గా శృతి హాసన్ని ముంబయ్ ఎయిర్ పోర్ట్లో గుర్తు తెలియని వ్యక్తి వెంటపడ్డాడు. తన కార్ పార్కింగ్ ఏరియా వరకి వెంబడించిన ఆ వ్యక్తి వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్న ఈ వ్యక్తి ఎవరనేది తెలియకపోయినప్పటికీ అతని ప్రవర్తన నచ్చకపోవడం వల్ల శృతి భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే శృతి హాసన్ భయపడి అక్కడ నుండి వెళ్ళిపోయింది. అంతేకాకుండా శృతి హాసన్ దగ్గరికి వెళ్లి మాట్లాడానికి  ఆ వ్యక్తి ట్రై చేస్తుండగా..నువ్వెవరో నాకు తెలియదు అంటూ శృతి గట్టి వార్నింగ్ ఇచ్చింది. 

సెలెబ్రెటీస్ ఒంటరిగా కనిపిస్తే మాట్లాడానికి ఎవరైనా ట్రై చేస్తుంటారు. కుదిరితే సెల్ఫీస్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ, ఇలా వెంబడించడం కరెక్ట్ కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

రీసెంట్ గా శృతి హాసన్ బాలయ్య బాబుతో వీరసింహా రెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య చిత్రాల తో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.