శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ బాగుంది

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ బాగుంది

ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నటించి టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లింది శ్రీలీల.  మరోవైపు  ఈ  ఏడాది కోలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ కూడా ఇస్తోంది. ఇప్పటికే తమిళంలో శివ కార్తికేయన్  ‘పరాశక్తి’ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  అనౌన్స్ చేశారు. అలాగే బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అరంగేట్రం చేయబోతోందని జరిగిన ప్రచారం నిజమైంది. 

కార్తీక్ ఆర్యన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తన ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది శ్రీలీల. ఈ విషయాన్ని టీజర్ ద్వారా కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్  చేశారు మేకర్స్. ఇందులో కార్తీక్ ఆర్యన్  సింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తుంటే,  తన లవర్ పాత్రలో శ్రీలీల కనిపించింది.  కార్తీక్ గిటార్ వాయిస్తూ  స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పాట పాడుతుండగా.. వీరిద్దరి మధ్య రొమాంటిక్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.  ఈ ఫస్ట్ లుక్ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి ఇదొక రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

అనురాగ్ బసు రూపొందిస్తున్న ఈ చిత్రానికి   ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. టీ సిరీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై భూషణ్ కుమార్, కృష్ణన్  కుమార్ నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ చిత్రాన్ని  దీపావళి కానుకగా  రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.  మరోవైపు ఈ సినిమాతో పాటు సైఫ్ ఆలీ ఖాన్ కొడుకు  ఇబ్రహీం అలీ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనూ మరో హిందీ మూవీకి శ్రీలీల కమిట్ అయ్యిందని తెలుస్తోంది. 

దీంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ బాగుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.  ఇక తెలుగులో ఆమె నటించిన ‘రాబిన్ హుడ్’ మార్చి 28న విడుదలవుతోంది. రవితేజతో ‘మాస్ జాతర’,  పవన్ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో పాటు అఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది.